డేగ - కాకి కథ
డేగతో పోరాడాలని ధైర్య చేసే ఏకైక పక్షి కాకి.
డేగ పైన కూర్చుని మెడ మీద పొడిస్తూ ఉంటుంది కాకి,
అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు.
ఎందుకంటే, కాకితో పోరేడే సమయం గానీ,
శక్తిని గానీ వృధా చేయడం డేగకు ఇష్టముండదు.
కానీ, తన రెక్కలను మరింత తెరిచి ఆకాశంలో
ఇంకా పై పైకి ఎగరడం ప్రారంభిస్తుంది.
డేగ ఆకాశంలో పైకెళ్ళిన కొద్ది,
కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరమవుతూ ఉంటుంది.
క్రమేపి ప్రాణవాయువు తగ్గినకొద్ది,
కాకికి ఊపిరందక అది క్రింద పడి పోతుంది.
నీతి
కాకులతో పోరాడుతూ, మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి.
వాటిని మీ స్థాయి ఎత్తులకు తీసుకెళ్ళండి,
వాటి శక్తి సామర్ధ్యాలు అంతమయి అవే మీ దారి నుండి తప్పుకుంటాయి.

Comments
Post a Comment